ఉపాధ్యాయులే ఊడుస్తున్నారు

ABN , First Publish Date - 2020-11-06T07:49:50+05:30 IST

పారిశుద్ధ్య సిబ్బంది లేక పాఠశాలల్లోని గదులను ఉపాధ్యాయులే ఊడుస్తున్నారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఉపాధ్యాయ

ఉపాధ్యాయులే ఊడుస్తున్నారు

వెంటనే స్వచ్ఛ కార్మికులను నియమించండి  

శ్రీదేవసేనకు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి 

హైదరాబాద్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): పారిశుద్ధ్య సిబ్బంది లేక పాఠశాలల్లోని గదులను ఉపాధ్యాయులే ఊడుస్తున్నారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు హాజరయ్యేంతవరకు ప్రతి పాఠశాలకు కనీసం ఒక స్వచ్ఛ కార్మికుడినైనా నియమించాలని పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేనను కోరారు. జాక్టో, యూఎస్పీసీ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో కలిసి పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేనతో గురువారం వివిధ సమస్యలపై చర్చించారు.


డియ్‌సఈ కార్యాలయంలో మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, పాఠశాలల ఉన్నతీకరణ, ఉపాధ్యాయుల వ్యక్తిగత సర్వీసు సమస్యలు గత జనవరి నుంచి అపరిష్కృతంగా ఉన్నాయని, విభాగాలవారీగా వాటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యావాలంటీర్లు, లాక్‌డౌన్‌ కాలంలో పనిచేసిన అవర్లీ బేస్డ్‌ టీచర్ల వేతనాలు విడుదల చేయాలని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సెక్టోరల్‌ అధికారుల రాత పరీక్ష ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అంతర్‌ జిల్లా బదిలీల్లో ఆదిలాబాద్‌ జిల్లా ఉపాధ్యాయులకు కూడా  అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2020-11-06T07:49:50+05:30 IST