టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య నలిగిన టీడీపీ, లెఫ్ట్‌

ABN , First Publish Date - 2020-12-05T09:19:42+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య జరిగిన పోరులో టీడీపీ, వామపక్షాలు, టీజేఎస్‌ నలిగిపోయాయి.

టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య నలిగిన టీడీపీ, లెఫ్ట్‌

 హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య జరిగిన పోరులో టీడీపీ, వామపక్షాలు, టీజేఎస్‌ నలిగిపోయాయి. ఈ పార్టీలు ఒక్క డివిజన్లోనూ సత్తా చూపలేక పోయాయి. ఒకప్పుడు.. ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్‌ స్థానాన్ని గెలుచుకున్న టీడీపీ.. తాజాగా   ఒక్క డివిజన్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది.

గత ఎన్నికల్లో వచ్చిన ఒక్క సీటునూ కోల్పోయింది. అలాగే, ముందుండి ఉద్యమాలు నడిపించే వామపక్షాలు కూడా ప్రభావం చూపడంలో విఫలమయ్యాయి. 24 డివిజన్లలో పోటీ చేసిన టీజేఎస్‌ నామమాత్రపు ఓట్లనే సాధించగలిగింది. 


Updated Date - 2020-12-05T09:19:42+05:30 IST