డబుల్‌ ఇళ్లపై కార్యాచరణ ప్రకటించాలి: టీడీపీ

ABN , First Publish Date - 2020-09-16T09:21:25+05:30 IST

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని..

డబుల్‌ ఇళ్లపై కార్యాచరణ ప్రకటించాలి: టీడీపీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 22లక్షల మంది పేదలకు ఇళ్లు లేవని సమగ్ర కుటుంబ సర్వేలో తేలిందన్నారు. వీరందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తామన్న టీఆర్‌ఎస్‌ హామీ అరకొరగానే అమలైందన్నారు. భూమిలేనివారికి, మురికివాడల్లో ఉంటున్నవారికి, గుడిసెల్లో నివశిస్తున్న వారికి, ఒకే గదిలో ఉంటున్న వారికి.. ఆ పథకం వర్తిస్తుందో లేదో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని భూపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-09-16T09:21:25+05:30 IST