అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఖండించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-11-27T01:25:31+05:30 IST

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు

అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఖండించిన చంద్రబాబు

అమరావతి/హైదరాబాద్: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన తెలుగు వెలుగులు ఎన్టీఆర్, పీవీ అని కొనియాడారు. రాజకీయ లబ్ధి కోసం మహనీయులను రచ్చకీడుస్తారా? దేశంలో పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ బాటలు వేశారని గుర్తుచేశారు. సంస్కరణలతో దేశ ఆర్థిక రంగాన్ని పీవీ పరుగులు పెట్టించారని ప్రశంసించారు. ఎన్టీఆర్, పీవీపై వ్యాఖ్యలు తెలుగు వారందరినీ అవమానించడమేనని చంద్రబాబు అన్నారు.


ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చేస్తామంటూ ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ప్రచారంలో  ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు మండిపడ్డాయి.

Updated Date - 2020-11-27T01:25:31+05:30 IST