ఫలక్‌నూమాలోని ఓ ఇంటిపై టాస్క్‌ఫోర్స్ దాడి

ABN , First Publish Date - 2020-10-07T20:43:19+05:30 IST

ఫలక్‌నూమాలోని జర్దాను తయారు చేసే ఓ ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

ఫలక్‌నూమాలోని ఓ ఇంటిపై టాస్క్‌ఫోర్స్ దాడి

హైదరాబాద్: ఫలక్‌నూమాలోని జర్దాను తయారు చేసే ఓ ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. జర్దాను తయారు చేస్తున్న మహ్మాద్ సోహైల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జర్దా తయారీ మిషన్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవ్యక్తి పరారయ్యాడు. రూ. 2 లక్షల విలువైన జర్దా డబ్బాలను, మిషన్‌ను ఫలక్‌నూమా పోలీసులకు టాస్క్‌ఫోర్స్ అప్పగించింది. పాతబస్తీలో పలు చోట్ల టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించినా అక్రమ దందాలు ఆగడంలేదు.

Read more