పేకాట శిబిరాలపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

ABN , First Publish Date - 2020-10-19T09:24:04+05:30 IST

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సంగెం, మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రెండు శిబిరాలపై వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం దాడులు చేశారు.

పేకాట శిబిరాలపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

రూ. 2.59 లక్షల నగదు స్వాధీనం


వరంగల్‌ అర్బన్‌ క్రైం, అక్టోబరు 18: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సంగెం, మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రెండు శిబిరాలపై వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 15 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.2.59 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ నందిరాంనాయక్‌ వివరాల ప్రకారం.. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురంలో బొల్లు రాజు.. ఓ వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని పేకాట శిబిరం నిర్వహస్తున్నాడు. పోలీసులు పక్కా సమాచారంతో తనిఖీలు చేసి అక్కడ పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేశారు.


అలాగే మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇబ్రహిం తన ఇంట్లో పేకాట శిబిరం నిర్వహిస్తుండగా పోలీసులు అక్కడికి వెళ్లి పది మందిని అరెస్టు చేశారు. రెండు శిబిరాల్లో కలుపుకుని రూ.2.59 లక్షల నగదు, రెండు కార్లు, 8 ద్విచక్రవాహనాలు, పది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది లోకల్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T09:24:04+05:30 IST