కార్పొరేట్ శక్తులకు కేంద్రం వత్తాసు: తమ్మినేని
ABN , First Publish Date - 2020-10-24T09:31:57+05:30 IST
కార్పొరేట్ శక్తులకు కేంద్రం వత్తాసు: తమ్మినేని

వనపర్తి టౌన్, అక్టోబరు 23: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ సంపదను శరవేగంగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక యాదవ సంఘ భవనంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత కల్లోలం, ఆర్థిక సంక్షోభం సృష్టిస్తున్న బీజేపీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను గెలిపించాలని కోరారు.