చుక్కల్లో చింతపండు ధరలు.. కిలో రూ.200

ABN , First Publish Date - 2020-04-08T09:55:14+05:30 IST

చింతపండు ధరలు చుక్కలనంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా సీజన్‌ ప్రారంభంలోనే కొత్త చింతపండు కిలో రూ.200 ధర ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారుల అంచనా...

చుక్కల్లో చింతపండు ధరలు.. కిలో రూ.200

మెదక్‌: చింతపండు ధరలు చుక్కలనంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా సీజన్‌ ప్రారంభంలోనే కొత్త చింతపండు కిలో రూ.200 ధర ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారుల అంచనా. గతేడాది దసరా పండగ సందర్భంగా చింతపండు కిలో రూ.120కి విక్రయించారు. జిల్లాలో చింత  చెట్లు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల మిగతా జిల్లాలు, రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.  ప్రస్తుతం కొత్త చింతపండును ఏసీ గోదాముల్లో వ్యాపారులు నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయుస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  


Updated Date - 2020-04-08T09:55:14+05:30 IST