12 ఏళ్లకు బయటపడిన తాలిపేరు స్టాప్‌లాగ్ గేట్
ABN , First Publish Date - 2020-05-19T08:40:23+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులో అత్యవసర పరిస్థితులు, మరమ్మతుల సమయంలో గేట్లను ఎత్తేందుకు ఉపయోగించే స్టాప్‌లాగ్ గేట్

చర్ల, మే 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులో అత్యవసర పరిస్థితులు, మరమ్మతుల సమయంలో గేట్లను ఎత్తేందుకు ఉపయోగించే స్టాప్‌లాగ్ గేట్ వరద నీటిలో కొట్టుకుపోయి 12 ఏళ్ల తరువాత బయటపడింది. 2008లో ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వచ్చిన వరద నీటిలో ఈ గేటు కొట్టుకు పోయి కొత్తపల్లి గ్రామ సమీపంలోనఇసుక తిన్నెల్లో కూరుకుపోయింది. గతంలో ఈ గేటును తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు. బయటకు తీసేందుకు అయ్యే ఖర్చు వివరాల నివేదికను కూడా తయారు చేశారు. కానీ 50 టన్నుల బరువున్న ఈ గేటు గోదావరి మధ్యలో కూరుకుపోవడంతో అధికారులు వదిలేసినట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
చర్ల మండలం కొత్తపల్లి సమీపంలో గోదావరి ఇసుకలో కనిపిస్తున్న తాలిపేరు స్టాప్‌లాగ్ గేట్