ఎయిర్టెల్ డీటీహెచ్‌లో టీశాట్ ఛానళ్లు
ABN , First Publish Date - 2020-08-15T10:20:25+05:30 IST
విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు అందిస్తోన్న టీశాట్ నెట్వర్క్ ఛానళ్లు ఎయిర్టెల్ డీటీహెచ్‌లో ..
హైదరాబాద్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు అందిస్తోన్న టీశాట్ నెట్వర్క్ ఛానళ్లు ఎయిర్టెల్ డీటీహెచ్‌లో ప్రసారం కానున్నాయి. టీశాట్ విద్య 948, టీశాట్ నిపుణ 949 ఛానల్ నంబర్లలో ప్రసారం అవుతాయి. ఈ మేరకు టీశాట్ నెట్‌వర్క్‌తో ఎయిర్టెల్ సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో టీశాట్ శాటిలైట్ ఛానళ్ల ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీశాట్ వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. పాఠశా ల, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలు చదివే లక్షలాది మంది విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధించి ప్రయోజనం కల్పించేందుకే ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీశాట్ సీఈవో శైలేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.