తెలంగాణకు స్వచ్ఛ అవార్డు ప్రదానం
ABN , First Publish Date - 2020-10-03T09:20:25+05:30 IST
స్వచ్ఛ భారత్ సర్వేలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్

హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ భారత్ సర్వేలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అవార్డును అందజేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా దీనిని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, స్వచ్ఛ భారత్ రాష్ట్ర మిషన్ డైరెక్టర్ ఎస్.దిలీ్‌పకుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వరుసగా మూడేళ్లు మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. కాగా, జిల్లాల కేటగిరిలో జాతీయ స్థాయిలో కరీంనగర్ మూడవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.