అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-11T04:48:26+05:30 IST

అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య

  లింగాలఘణపురం డిసెంబరు 10: అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కుందారంలో చోటు చేసుకుంది. ఎస్సై దేవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గడ్డం అనిత(34)ను కొద్ది కాలంగా భర్త, అత్త, మరిది వేధించసాగారు. దీంతో మనోవేదనకు గురైన ఆమె ఈ నెల 7న పురుగుల మందు తాగి ఆత్మహ త్యాయత్నానికి పాల్పడింది. ఎంజీఎంలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-12-11T04:48:26+05:30 IST