జలమయమైన సూర్యాపేట పట్టణం

ABN , First Publish Date - 2020-09-14T15:58:36+05:30 IST

రాత్రి కురిసిన భారీ వర్షానికి సూర్యాపేట పట్టణం పూర్తిగా జలమయమైంది.

జలమయమైన సూర్యాపేట పట్టణం

సూర్యాపేట: రాత్రి కురిసిన భారీ వర్షానికి సూర్యాపేట పట్టణం పూర్తిగా జలమయమైంది. ఆత్మకూర్ (ఎస్) మండలం నశింపేట వద్ద ప్రవహిస్తోన్న వాగును దాటే క్రమంలో గొర్రెలను తరలించే వాహనం నీటిలో కొట్టుకు పోయింది. వెంటనే గుర్తించిన స్థానికులు వాహనంలోని ముగ్గురిని కాపాడారు. పట్టణ ప్రాంతాలైన శ్రీనివాసకాలనీ, మానస నగర్, ఇందిరమ్మ కాలనీ శివారు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. 

Updated Date - 2020-09-14T15:58:36+05:30 IST