రైతులను నాశనం చేసే చట్టాలొద్దు: సురవరం

ABN , First Publish Date - 2020-12-17T09:10:00+05:30 IST

రైతులను సర్వనాశనం చేసే చట్టాలు వద్దని, కార్పొరేట్‌ వ్యవసాయ విధానం దేశప్రజలకు ఆమోదయోగ్యం కాదని

రైతులను నాశనం చేసే చట్టాలొద్దు: సురవరం

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రైతులను సర్వనాశనం చేసే చట్టాలు వద్దని, కార్పొరేట్‌ వ్యవసాయ విధానం దేశప్రజలకు ఆమోదయోగ్యం కాదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మక్దూం భవన్‌లో రంగారెడ్డి జిల్లా సీపీఐ కార్యదర్శి జంగయ్య అధ్యక్షతన జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి రైతులు సహా వివిధ వర్గాలు చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-17T09:10:00+05:30 IST