సురవరం జయంతుత్సవ లోగో ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-12-28T20:42:15+05:30 IST

తెలంగాణ ఆత్మగౌరవం కోసం గర్జించిన తొలి గొంతుక, తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యానికి స్ఫూర్తి ప్రధాత,

సురవరం జయంతుత్సవ లోగో ఆవిష్కరణ

హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవం కోసం గర్జించిన తొలి గొంతుక,  తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యానికి స్ఫూర్తి ప్రధాత, సుప్రసిద్ధ పాత్రికేయులు, కవి, రచయిత, విమర్శకులు, పరిశోధకులు, సంఘసంస్కర్త మహానీయులు సురవరం ప్రతాపరెడ్డి గారి 125వ, జన్మదిన ఉత్సవాల్లో భాగంగా సోమవారం  బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో లోగో ఆవిష్కరణ కార్యక్రమం కనులపండగలా జరిగింది.


 రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణచారీ, ఐజేయూ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఎస్.వి.సత్యనారాయణ, గద్వాల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితతో పాటు సురవరం ప్రతాప రెడ్డి కుటుంబ సభ్యులు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T20:42:15+05:30 IST