తెలుగు వర్సిటీకి సురవరం పేరు

ABN , First Publish Date - 2020-12-29T07:47:28+05:30 IST

తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు చొరవ తీసుకుంటానని.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రతాపరెడ్డి సేవలను సముచితంగా

తెలుగు వర్సిటీకి సురవరం పేరు

కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతా.. మంత్రి కేటీఆర్‌ హామీ


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు చొరవ తీసుకుంటానని.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రతాపరెడ్డి సేవలను సముచితంగా స్మరించుకునేలా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సోమవారమిక్కడ సురవరం 125వ జయంతి ఉత్సవాల ప్రతీకను మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవిష్కరించారు. గోల్కొండ కవుల సంచిక ద్వారా ప్రతాపరెడ్డి 90 ఏళ్ల కిందటే తెలంగాణ కవుల అస్తిత్వాన్ని, ఈ నేల ఆత్మగౌరవాన్ని ఘనంగా చాటి చెప్పిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచారని కేటీఆర్‌ కొనియాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఏదైనా జలాశయానికి ప్రతాపరెడ్డి పేరుపెట్టేందుకు కృషిచేస్తానని శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టాలని, అందుకు కేటీఆర్‌ ప్రత్యేక చొరవ చూపాలని నిరంజన్‌రెడ్డి కోరారు.

Updated Date - 2020-12-29T07:47:28+05:30 IST