మమత కుటుంబానికి అండగా ఉంటాం: కవిత

ABN , First Publish Date - 2020-11-15T21:43:57+05:30 IST

ఎమ్మెల్సీ కవితను యాదవసంఘం ప్రతినిధులు కలిశారు. నిజామాబాద్‌ జిల్లా న్యావనందిలో హత్యకు గురైన మమత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మమత కుటుంబానికి అండగా ఉంటాం: కవిత

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితను యాదవసంఘం ప్రతినిధులు కలిశారు. నిజామాబాద్‌ జిల్లా న్యావనందిలో హత్యకు గురైన మమత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ సీపీ కార్తికేయతో కవిత ఫోన్లో మాట్లాడారు. కేసు దర్యాప్తు కవిత వివరాలను తెలుసుకున్నారు. దర్యాప్తులో ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీపీని కోరారు. మమత కుటుంబానికి అండగా ఉంటామని, మహిళల రక్షణలో రాజీపడమని కవిత స్పష్టం చేశారు. ఇటీవల నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం లోని న్యావనంది గ్రామంలో మమత అనే మహిళ హత్యకు గురయింది. మమత హత్యపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-11-15T21:43:57+05:30 IST