దేవేందర్‌తో వెళ్లడమే సునీల్‌రెడ్డి పాలిట శాపమైంది

ABN , First Publish Date - 2020-03-04T09:29:29+05:30 IST

జర్నలిస్టు బొమ్మినేని సునీల్‌రెడ్డి హత్యకేసులో.. అతడికి, నిందితుడు దయానంద్‌కు అంతకు ముందు అసలు పరిచయమే లేదని పోలీసులు గుర్తించారు. నిజానికి

దేవేందర్‌తో వెళ్లడమే సునీల్‌రెడ్డి పాలిట శాపమైంది

పక్కాప్లాన్‌తోనే దయానంద్‌ దాడి

గోవిందరావుపేట, మార్చి 3: జర్నలిస్టు బొమ్మినేని సునీల్‌రెడ్డి హత్యకేసులో.. అతడికి, నిందితుడు దయానంద్‌కు అంతకు ముందు అసలు పరిచయమే లేదని పోలీసులు గుర్తించారు. నిజానికి దయానంద్‌కు అప్పు ఇచ్చింది దేవేందర్‌రెడ్డి అని.. అతడికి తోడుగా వెళ్లడమే సునీల్‌రెడ్డి పాలిట శాపంగా మారిందని తేల్చారు. సోమవారం దేవేందర్‌రెడ్డి వెంట పస్రా వెళ్లిన సునీల్‌రెడ్డి.. ఓ ఫోన్‌కాల్‌ రావడంతో 20 నిమిషాలపాటు మాట్లాడుతూ బేకరీ బయటే ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.


బేకరీ వెనక గదిలో దేవేందర్‌రెడ్డిపై దాడిచేసిన దయానంద్‌, అతడు చనిపోయాడని భావించి, ఏమీ ఎరగనట్లు బయటకు వచ్చాడు. అక్కడ సునీల్‌ను చూసి, అప్పు విషయాన్ని సెటిల్‌ చేసుకుంటున్నాం రమ్మంటూ పిలిచాడు. అలా సునీల్‌ను ఇంటి వరండాలో దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత సునీల్‌ శవాన్ని మాయం చేసేందుకు దయానంద్‌ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. కత్తిపోట్లకు గురైన దేవేందర్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2020-03-04T09:29:29+05:30 IST