వర్షాలపై సుమోటో విచారణ జరపం: హైకోర్టు

ABN , First Publish Date - 2020-08-18T07:55:09+05:30 IST

కుండపోత వర్షాలకు వరంగల్‌ సహా నదీతీర ప్రాంతాలు ముంపునకు గురికావడంతో ప్రజల ఇబ్బందుల

వర్షాలపై సుమోటో విచారణ జరపం: హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కుండపోత వర్షాలకు వరంగల్‌ సహా నదీతీర ప్రాంతాలు ముంపునకు గురికావడంతో ప్రజల ఇబ్బందులను సుమోటోగా విచారణకు స్వీకరించాలని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ హైకోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను సీజే ఆర్‌.ఎస్‌. చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తోసిపుచ్చింది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని, బాధితులను రక్షించేందుకు రెండు హెలికాప్టర్లను, సైన్యాన్ని రంగంలోకి దింపిందని పేర్కొంది. ఇలాంటి అభ్యర్థనను సుమోటోగా విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది.

Updated Date - 2020-08-18T07:55:09+05:30 IST