ప్రియతమా.. నీవెంటే నేనూ!

ABN , First Publish Date - 2020-10-27T09:40:44+05:30 IST

అకాల మరణంతో ప్రేమించిన యువతి తిరిగిరాని లోకాలకు చేరిందనే బాధను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ప్రియతమా.. నీవెంటే నేనూ!

 ప్రేయసి సమాధి వద్ద యువకుడి ఆత్మహత్య 


మహదేవపూర్‌, అక్టోబరు 26: అకాల మరణంతో ప్రేమించిన యువతి తిరిగిరాని లోకాలకు చేరిందనే బాధను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆమె సమాధి వద్దే ఉరివేసుకున్నాడు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కురవపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చల్లా మహేశ్‌, అదే గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలకు తమ ప్రేమ విషయాన్ని తెలియజేసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో కాలం వెళ్లదీస్తున్న మహేశ్‌, ఆదివారం తన ప్రియురాలు లేని లోకంలో ఉండలేనంటూ వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి ఆమె సమాధి వద్దకు వెళ్లి ఉరివేసుకున్నాడు.  

Updated Date - 2020-10-27T09:40:44+05:30 IST