స్మార్ట్‌ఫోన్‌ లేదని..ఇక చదువుకోలేనని..విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-25T06:32:36+05:30 IST

స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వడంలేదని మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మండ లం న్యూ పోరట్‌పల్లికి చెందిన కోకా రోజా (18) సిద్దిపేట జిల్లా

స్మార్ట్‌ఫోన్‌ లేదని..ఇక చదువుకోలేనని..విద్యార్థిని ఆత్మహత్య

 జ్యోతినగర్‌, డిసెంబరు 24: స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వడంలేదని  మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మండ లం న్యూ పోరట్‌పల్లికి చెందిన కోకా రోజా (18)  సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు ప్రభు త్వ బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలో డీఈఈఈ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. రోజా తండ్రి  ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు ఉండటంతో..  కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని రోజా తల్లిదండ్రుల కోరింది. అయితే.. స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చే స్తోమత తమకు లేదని, ఎలాగోలా సర్దుకోవాలని రోజా తండ్రి తేల్చిచెప్పారు. దీంతో మనస్తాపం చెందిన రోజా.. ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఫ్యానుకు ఉరేసుకుంది.  

Updated Date - 2020-12-25T06:32:36+05:30 IST