పుట్టింటికి పంపలేదని బిడ్డలతో సహా ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-28T08:56:59+05:30 IST
క్రిస్మ్‌సకు పుట్టింటికి వెళ్లేందుకు భర్త అనుమతించలేదన్న బాధతో ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకుందా భార్య. జవహర్‌నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది

ఇద్దరు కూతుళ్లతో సహా చెరువులో దూకిన వివాహిత
జవహర్‌నగర్, డిసెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): క్రిస్మ్‌సకు పుట్టింటికి వెళ్లేందుకు భర్త అనుమతించలేదన్న బాధతో ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకుందా భార్య. జవహర్‌నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, నాగమణి దంపతులు హైదరాబాద్‌లోని బాలాజీనగర్ బృందావన్ కాలనీలో ఉంటున్నారు. వీరికి రూబీ (5), పండు (8నెలలు) అనే ఇద్దరు కుమార్తెలు. క్రిస్మ్‌సకు పుట్టింటికి వెళ్తానని నాగమణి చాలారోజులుగా భర్తను కోరుతోంది. పండుగ అయిన తర్వాత వీలు చూసుకుని వెళ్లమని అతడు చెప్పడంతో వాగ్వాదానికి దిగింది. అది కాస్తా దంపతుల మధ్య గొడవకు దారి తీసింది. మనస్తాపంతో శనివారం పిల్లలను తీసుకుని నాగమణి వెళ్లిపోయింది. ఎంత వెతికినా కనిపించకపోవడంతో.. నాగేశ్వర్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదివారం ఉదయం చెన్నాపురం చెరువులో మూడు మృతదేహాలు కనిపించాయని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వాటిని నాగమణి, ఆమె ఇద్దరు పిల్లలకు చెందినవేనని గుర్తించామన్నారు.