అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-03-23T10:49:41+05:30 IST
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి

చేవెళ్ల, మార్చి 22: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన కడుమురి వెంకటయ్య(53) మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పంట ఏపుగా పెరిగినా, దిగుబడి రాలేదు. పెట్టుబడి, కూతురి వివాహం కోసం రూ.3లక్షల వరకు అప్పులు చేశాడు. అయితే పంట దిగుబడి రాక, చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న మనస్తాపంతో వెంకటయ్య శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.