జీతం రాక.. జీవనం కష్టమై
ABN , First Publish Date - 2020-11-25T07:12:09+05:30 IST
అతడో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. కరోనా రోగులకు సహాయకుడి (పేషంట్ అటెండర్)గా వ్యవహరించాల్సిన క్లిష్టమైన బాధ్యతలు..!

గాంధీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
4 నెలల నుంచి నిలిచిన వేతనాల చెల్లింపు..
శరీరంపై కిరోసిన్ పోసుకొని అంటించుకున్న పేషంట్ అటెండర్
మానేద్దామంటే భత్యాలు సహా ఎగవేత భయం
అడ్డగుట్ట నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అతడో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. కరోనా రోగులకు సహాయకుడి (పేషంట్ అటెండర్)గా వ్యవహరించాల్సిన క్లిష్టమైన బాధ్యతలు..! అలాంటి కొలువులో నెలల తరబడి జీతాల్లేక జీవనం కష్టమైపోయింది. దీంతో విసుగు చెంది ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మంగళవారం గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
రహ్మత్‌నగర్‌కు చెందిన హరిబాబు(45) గాంధీలో ఔట్‌సోర్సింగ్ విభాగంలో రోగులకు సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలలుగా ఇతడికి జీతం రావడం లేదు. పనిచేసిన కాలానికి టీఏ, డీఏలు సహా మొత్తం వేతనం నిలిపివేస్తారనే భయంతో మానేసి వెళ్లిపోలేకపోతున్నాడు. దీంతో అతడు శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సహచరులు గమనించి.. మంటలను ఆర్పి గాంధీలోనే చికిత్సకు చేర్పించారు.