ఉపాధి కరువై వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-11-26T08:17:40+05:30 IST

రెండేళ్లుగా ఉపాధి లేదు. ఆర్థిక సమస్యలు కుంగదీశాయి. తీవ్ర మనోవేదనకు గురై ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం వద్దే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు వీరేశం(45

ఉపాధి కరువై వ్యక్తి ఆత్మహత్యాయత్నం

 సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద కలకలం

పంజాగుట్ట/హైదరాబాద్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రెండేళ్లుగా ఉపాధి లేదు. ఆర్థిక సమస్యలు కుంగదీశాయి. తీవ్ర మనోవేదనకు గురై ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం వద్దే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు వీరేశం(45). కామారెడ్డి పాత బస్టాండ్‌ ప్రాంతానికి చెందిన అతను దుబాయిలో ప్రైవేటు ఎలక్ర్టీషియన్‌గా 14 ఏళ్లు పనిచేశాడు. రెండేళ్ల క్రితమే స్వగ్రామానికి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నాడు. ప్రభుత్వం కూడా ఉద్యోగం కల్పించడం లేదని కొంతకాలంగా ఆవేదన చెందుతున్నాడు.


 బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్దకు వచ్చాడు. బిబి 1 గేట్‌ వద్ద తనతో తెచ్చుకున్న  డీజిల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు.

ఒంటిపై నీళ్లు పోసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రెండేళ్లుగా ఉద్యోగం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 


Updated Date - 2020-11-26T08:17:40+05:30 IST