విద్యార్ధులకు మేలు జరిగే విధంగా విద్యా విధానం
ABN , First Publish Date - 2020-10-08T01:39:53+05:30 IST
ప్రపంచ మహమ్మారి కొవిడ్ వల్ల విద్యా సంవత్సరం పూర్తిగా నష్టపోకుండా రాష్ట్రంలో అందరికీ మేలు జరిగే విధంగా విద్యను అందించాలన్నదే ప్రభుత్వ తపన అని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, సబితాఇంద్రారెడ్డి అన్నారు.

హైదరాబాద్: ప్రపంచ మహమ్మారి కొవిడ్ వల్ల విద్యా సంవత్సరం పూర్తిగా నష్టపోకుండా రాష్ట్రంలో అందరికీ మేలు జరిగే విధంగా విద్యను అందించాలన్నదే ప్రభుత్వ తపన అని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, సబితాఇంద్రారెడ్డి అన్నారు. కొవిడ్ కారణంగా విద్యార్దులు నష్టపోకుండా ఏం చేయాలన్న దాని పై ముఖ్యమం కేసీఆర్ అనేక సార్లు సమావేశాలు నిర్వహించి డిజిటల్‌క్లాసులు నిర్వహించాలని సూచించారన్నారు. కేంద్ర నిబంధనల మేరకు ఆన్‌లైన్ విద్య తప్పని సరి అవుతుందని అయితే ఇది అందరికీ చేరేలా చూడడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని అన్నారు.
రానున్న రోజుల్లో డిజిటల్ విద్య ద్వారా బోధన ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందన్నారు. కొవిడ్ నేపధ్యంలో విద్యా వ్యవస్ధలో చేపట్టాల్సిన కార్యక్రమాలు,పాఠశాలల పునః ప్రారంభం తదితర విద్యా సంబంధ అంశాలపై ఎంసిహెచ్‌ఆర్‌డిలో జరిగిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి నేతృత్వంలో మంత్రులు కొప్పుల, సత్యవతిరాథోడ్, గంగుల కమలాకర్ సభ్యులుగా ఉన్న మంత్రుల సబ్‌కమిటీ సమావేశమై చర్చించింది.
ఈసమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ విద్యా సంవత్సరం ఆగిపోకుండా విద్యార్దులు నష్టపోకుండా ఉండాలని సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. విద్యాసంవత్సరం ఆగిపోకుండా విద్యార్ధులకు ఆన్‌లైన్ విద్యనందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 99శాతం మందికి టీవీలు ఉన్నాయి. 40శాతం మందికి వెబ్ సదుపాయం వుంది. 86శాతం మందికి ఆన్‌లైన్ విద్య అందుతుందనేది సర్వే ద్వారా తెలిసిందన్నారు. పరిస్థితిని బేరీజు వేసుకుని పాఠశాలల పునః ప్రారంభం పై సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.