యాసంగి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2020-03-02T22:13:32+05:30 IST
యాసంగి ధాన్యం కొనుగోలుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లుచేస్తోంది. ఈసారి 77.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు

హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లుచేస్తోంది. ఈసారి 77.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. ఏప్రిల్1 నుంచి ప్రారంభమయ్యే యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది. 2019- 20 యాసంగి కార్యాచరణపై సోమవారం హాకా భవన్‌లో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉపసంఘం సభ్యులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పాల్గొన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీసంచులు, స్టోరేజ్ స్పేస్, రవాణా తదితర అంశాలపై ప్రధానంగా దృష్టిసారించానిఇ సూచించారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యమంగా కాళేశ్వరం నీరు రాకతో ప్రతి ఎకరా సాగులోకి వస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరగబోతోందని ఈసందర్భంగా మంత్రులు తెలిపారు. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఈరబీలో 77.73 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం వస్తుందనిఇ అంచనా వేశారు పెరిగిన అంచనాలకు అనుగుణంగా కొనుగగోళ్లకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. గత ఏడాది రబీలో పౌరసరఫరాల శాఖ 37లక్షల మెట్రక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేయగా ఈసారి రెట్టింపు ధాన్యాన్ని కొనుగోలు ఉంటుందనిఇ అంచనా వేశారు. రైస్ మిల్లర్లకు చెల్లించే అదనపు మిల్లింగ్‌ఛార్జీలపై కూడా ఈసమావేశంలో చర్చించారు. ఇతర రాష్ర్టాల నుంచి రాష్ట్రంలోకి దళారీలు ధాన్యం తీసుకు వచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల దారాఆ విక్రయించకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఉద్యానవనశాఖ డైరెక్టరర్ వెంకట్రామ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ ఎండి భాస్కరాచారి, ఇతరఅధికారులు పాల్గొన్నారు.