హాస్టళ్లలో అక్రమంగా ఉంటున్న విద్యార్థులు ఖాళీ చేయాలి: ఓయూ పీఆర్‌ఓ
ABN , First Publish Date - 2020-12-19T08:05:41+05:30 IST
ఓయూ హాస్టళ్లలో అక్రమంగా ఉంటున్న విద్యార్థులు తక్షణమే ఖాళీ చేయాలని ఓయూ ప్రజా సంబంధాల అధికారి (

ఉప్పల్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఓయూ హాస్టళ్లలో అక్రమంగా ఉంటున్న విద్యార్థులు తక్షణమే ఖాళీ చేయాలని ఓయూ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్‌ఓ) శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. ఒకవేళ ఇంకా హాస్టళ్లలో ఉండేందుకు యత్నిస్తే పోలీసుల సహాయంతో పంపించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్ గదుల్లో ఉంటున్నట్లు వర్సిటీ యంత్రాంగం దృష్టికి వచ్చిందన్నారు.
కాగా, కరోనా పేరుతో ఓయూ హాస్టళ్లను మూసివేసి విద్యాబోధనను, పరిశోధనలను దెబ్బతీస్తున్నారని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.