పదో తరగతి పరీక్షలు రాసే సంక్షేమహాస్టళ్ల విద్యార్ధుల పట్ల ప్రత్యే శ్రద్ధ

ABN , First Publish Date - 2020-06-04T22:22:15+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన పదో తరగతి పరీక్షలు తిరిగి ఈనెల 8వ తేదీ నుంచి జరగనున్నాయి.

పదో తరగతి పరీక్షలు రాసే సంక్షేమహాస్టళ్ల విద్యార్ధుల పట్ల ప్రత్యే శ్రద్ధ

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన పదో తరగతి పరీక్షలు తిరిగి ఈనెల 8వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలోనూ, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్దుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఎస్సీ, ఎస్టీ, ,బిసి, మైనారీటీశా సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్ధులు పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన చర్మలు తీసుకోవాలని ఇప్పటికే ఆయా సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. ఇప్పటికే అన్నిసంక్షేమవసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలకు విద్యార్ధులు చేరుకున్నారు. 


ఈమేరకు బిసి వసంతి, జ్యోతిబాపూలే ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్దుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు రాయబోతున్న బిసి విద్యార్ధులకు అవసరమైన వస్తువులను సమకూర్చడానికి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున కేటాయించినట్టు తెలలిపారు. పిల్లల్లో పరీక్షలు బాగా రాయాలన్న ఉత్సాహం పెంచేందుకు వారుబాగా చదువుకునేందుకు ఒక్కక్క విద్యార్ధికి చేతి గడియారం, కంపాస్‌బాక్స్‌, పరీక్ష ప్యాడ్‌, ఇతర స్టేషనరీ వస్తువులను అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం బిసి వసతి గృహాలు, జ్యోతిబాపూలే ఆశ్రమపాఠశాలల్లో 8,225 విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నట్టు తెలిపారు. 


వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్ధులకు నాణ్యమైన పోషకవిలువలున్న భోజనం అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రతి రోజూ ఒకగుడ్డు, పండ్లు, మల్టీవిటమిన్‌ టాబ్లెట్స్‌, వేడిచేసి చల్లార్చిన నీటిని వారికి అందించనున్నారు. పరీక్షకు పరీక్షకు మధ్య రెండు రోజుల సమయంలో నిపుణులతో వారికి ఆయా సబ్జెక్టులపై అవగాహన కల్పించేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-06-04T22:22:15+05:30 IST