లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు: పోలీసులు

ABN , First Publish Date - 2020-03-23T18:26:27+05:30 IST

తెలంగాణలో లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు: పోలీసులు

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సెక్షన్ 188 కఠినతరం చేస్తామని పోలీసులు హెచ్చరించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించినా నగరంలో వాహనాలు యథాప్రకారం తిరుగుతున్నాయని అన్నారు. ప్రజలు నిత్యావసరాల కోసం రోడ్లపైకి చేరుకుంటున్నారని, కొందరు ఉద్యోగస్తులు కార్యాలయాలకు వెళ్ళడానికి రోడ్ల పైకి వస్తుండడంతో విపరీతమైన ట్రాఫిక్ నెలకొందన్నారు. దీంతో ఆటోలను, క్యాబ్‌లను అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామన్నారు. కేంద్రం కూడా 188 యాక్ట్‌ను రాష్ట్రంలో కఠినంగా అమలు చేయాలని సూచించిందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-03-23T18:26:27+05:30 IST