లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-04-07T16:55:47+05:30 IST

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై..

లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

హైదరాబాద్: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన ఉత్తర్వుల ప్రకారం టూ వీలర్‌పై ఒకరు, ఫోర్ వీలర్‌పై ఇద్దరు ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. వాటిని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


కరోనా వ్యాధి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ.. ప్రజలను అప్రమత్తం చేస్తోంది. అయినా జనాలు నిబంధనలు పెడచెవిన పెడుతున్నారు. అత్యవసరంగా వస్తున్నవారిని మాత్రం పోలీసులు విడిచిపెడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ ఆదేశాలతో నిబంధనలు కఠినతరంగా అమలు చేస్తున్నామని పోలీసులు ఏబీఎన్‌కు తెలిపారు. ప్రజలు కూడా అత్యవసరమైనే బయటకు రావాలని, సరదాగా తిరగడానికి మాత్రం రావద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.

Read more