ఇంకా వేతనాల్లో కోతలా?: సంజయ్
ABN , First Publish Date - 2020-05-29T09:11:41+05:30 IST
ఇంకా వేతనాల్లో కోతలా?: సంజయ్

లాక్‌డౌన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించడం ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. ధనిక రాష్ట్రమని ఆరేళ్లుగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులకు వరుసగా మూడోనెలలోనూ సగం వేతనమే ఇస్తామనడాన్ని ఆయన ఖండించారు.