ఎమ్మెల్యే రాజయ్యకు తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2020-12-14T03:34:14+05:30 IST
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు తృటిలో ప్రాణాపాయం తప్పింది.

వరంగల్: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆదివారం తన కారులో జనగాం వెళ్తుండగా రఘునాథపల్లి వద్ద ఎమ్మెల్యే కార్లకు ఇసుక లారీలు అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేకు వేశాడు. దీంతో ఎమ్మెల్యే రాజయ్య కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రాజయ్యకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.