రాష్ట్రాలు మా మాట వినడంలేదు

ABN , First Publish Date - 2020-08-18T08:07:17+05:30 IST

తమకు ఎటువంటి అధికారాలూ లేవని, తమ సూచనలు, ఆదేశాలను రాష్ట్రాలు

రాష్ట్రాలు మా మాట వినడంలేదు

  • జలవివాదాలపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి.. శ్రీరాంతో బోర్డుల అధికారులు


హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తమకు ఎటువంటి అధికారాలూ లేవని, తమ సూచనలు, ఆదేశాలను రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని కృష్ణా, గోదావరి బోర్డుల అధికారులు అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌ను ఖరారు చేసే బజాజ్‌ కమిటీ ఎటూ తేల్చకుండానే కనుమరుగయిందని, ఇలాంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించడం సాధ్యం కాదన్నారు. త్వరలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనున్న నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం సోమవారం కృష్ణా, గోదావరి బోర్డుల అఽధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. హైదరాబాద్‌లోని గోదావరి బోర్డు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదానికి కారణాలు, ట్రైబ్ల్యునల్‌ తీర్పులు,  అమలు,  కేంద్రంపై ఎందుకు ఆధారపడాల్సి వస్తోంది? వంటి అంశాలను శ్రీరాం అడిగి తెలుసుకున్నారు. అయితే బోర్డులకు వర్కింగ్‌ మాన్యువల్స్‌ను  ఖరారు చేయలేదని, దాంతో రాష్ట్రాలను నియంత్రించడానికి తమకు ఎటువంటి అధికారాలు లేవని అధికారులు తెలిపారు.  

Updated Date - 2020-08-18T08:07:17+05:30 IST