బహ్రెయిన్‌లో గుండెపోటుతో రాష్ట్ర వాసి మృతి
ABN , First Publish Date - 2020-04-25T08:07:35+05:30 IST
ఎన్నో ఆశలతో బతుకుదెరువు కోసం బహ్రెయిన్‌కు వెళ్లిన యువకుడు గుండెపోటుతో చనిపోయాడు.

విమాన సేవలు ఆగిపోవడంతో మృతదేహం తరలింపు కష్టమే!
బొంరాస్‌పేట్, ఏప్రిల్ 24: ఎన్నో ఆశలతో బతుకుదెరువు కోసం బహ్రెయిన్‌కు వెళ్లిన యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. వికారాబాద్ జిల్లా బొంరా్‌సపేట్ మండలం మెట్లకుంట గ్రామానికి చెందిన సందెగాళ్ల దయాకర్ (23) రెండున్నరేళ్ల క్రితం బహ్రెయిన్‌కు వెళ్లాడు. అక్కడ అక్కర్ ప్రాంతంలోని అల్‌గానా కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అతను గుండెపోటుకు గురై చనిపోయాడు. అతనిమరణవార్తను స్నేహితులు ఫోన్ ద్వారా మెట్లకుంటలోని కుటుంబ సభ్యులకు తెలిపారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆగిపోవడంతో దయాకర్‌ను చివరిసారి చూస్తామో లేదోనని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.