గిరిజనులను ఆదుకోని ప్యాకేజీ: సత్యవతి

ABN , First Publish Date - 2020-05-19T10:24:22+05:30 IST

కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్బర్‌ భార త్‌ అభియాన్‌ ప్యాకేజీతో గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని కేంద్ర గిరిజన శాఖ మంత్రి

గిరిజనులను ఆదుకోని ప్యాకేజీ: సత్యవతి

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్బర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీతో గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ముండాతో.. రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితులపై కేంద్ర మంత్రి .. మంత్రి సత్యవతికి సోమవారం ఫోన్‌  చేసి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని కూడా ఆరా తీశారు. కేంద్ర ప్యాకేజీతో రాష్ర్టానికి, గిరిజనులకు పెద్దగా ప్రయోజనమేమీ లేదని సత్యవతి పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-19T10:24:22+05:30 IST