అపెక్స్ మినిట్స్‌పై ఇంకా తేల్చని రాష్ట్ర సర్కారు
ABN , First Publish Date - 2020-11-13T08:48:40+05:30 IST
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
కేసీఆర్‌తో చర్చ కోసం ఎదురుచూస్తున్న అధికారులు
హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ మినిట్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి ఏదో ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభు త్వం స్పష్టం చేయాల్సి ఉంది. అయితే, ఈవిషయంపై చర్చిం చడానికి సీఎం కేసీఆర్ సమయం కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.
సీఎం ఇచ్చే సూచనలు, ఆదేశాల ప్రకారం కేం ద్రానికి లేఖ రాయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్ర భుత్వం స్పందనను తెలియజేయడంలో ఆలస్యం చేస్తే కేం ద్రమే మినిట్స్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.