ఖమ్మానికి ఐటీ వెలుగులు!

ABN , First Publish Date - 2020-12-07T08:45:39+05:30 IST

ఖమ్మంలో నూతనంగా నిర్మించిన ఐటీహబ్‌ను సోమవారం మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాదు తర్వాత పలు జిల్లా కేంద్రాల్లో ఐటీసేవల విస్తరణలో భాగంగా ఖమ్మంలో రూ.27 కోట్లతో ఈ ఐటీహబ్‌ మొదటి దశ పనులు పూర్తయ్యాయి

ఖమ్మానికి ఐటీ వెలుగులు!

నేడు ఐటీహబ్‌ ప్రారంభం 


ఖమ్మం, డిసెంబరు 6: ఖమ్మంలో నూతనంగా నిర్మించిన ఐటీహబ్‌ను సోమవారం మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాదు తర్వాత పలు జిల్లా కేంద్రాల్లో ఐటీసేవల విస్తరణలో భాగంగా ఖమ్మంలో రూ.27 కోట్లతో ఈ ఐటీహబ్‌ మొదటి దశ పనులు పూర్తయ్యాయి. మొత్తం ఐదు ఫ్లోర్లతో సువిశాలంగా నిర్మించిన ఐటీహబ్‌ ఖమ్మానికి కొత్త వెలుగులు తెచ్చింది. ఇప్పటికే 16 సంస్థలు ఇక్కడ తమ వ్యాపారాలు ప్రారంభించేందుకు ముందుకు రాగా పదికిపైగా కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. కాగా, ఐటీహబ్‌ రెండో దశ పనులకు మరో రూ.25 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

Updated Date - 2020-12-07T08:45:39+05:30 IST