తెలంగాణలో రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-12T01:19:49+05:30 IST

తెలంగాణలో రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభమైంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ను సీఎస్‌ సోమేష్‌కుమార్

తెలంగాణలో రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణలో రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభమైంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ను సీఎస్‌ సోమేష్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడారు. ‘నూతనంగా తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శం. రిజిస్ట్రార్లు సహా అధికారులెవరికీ ఎలాంటి విచక్షణాధికారాలు ఉండవు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్లు మాత్రమే బుక్‌ చేసుకోవచ్చు. ఆధార్ సంఖ్య ఇవ్వని వారికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. రిజిస్ట్రేషన్ తర్వాత ఆన్‌లైన్‌లో వెంటనే మ్యుటేషన్. రిజిస్ట్రేషన్‌ తర్వాత వెంటనే డాక్యుమెంట్లు ఇస్తాం. ఎల్‌ఆర్ఎస్‌ లేనివారి విషయంలో కూడా త్వరలోనే నిర్ణయం. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఓపెన్‌ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. పెండింగ్‌ మ్యుటేషన్లు ధరణిలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం వంద శాతం స్లాట్‌ బుకింగ్‌ ద్వారానే రిజిస్ట్రేషన్లు’ జరుగుతున్నాయని తెలంగాణ సీఎస్‌ సోమేష్‌కుమార్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-12T01:19:49+05:30 IST