వ్యవసాయ కమిషనరేట్‌లో ఈ- ఆఫీస్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-08-20T09:38:25+05:30 IST

వ్యవసాయ కమిషనరేట్‌లో ’ఈ- ఆఫీస్‌’ సేవలను బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి

వ్యవసాయ కమిషనరేట్‌లో ఈ- ఆఫీస్‌ ప్రారంభం

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ కమిషనరేట్‌లో  ’ఈ- ఆఫీస్‌’ సేవలను బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. కొవిడ్‌- 19 దృష్ట్యా ఉద్యోగుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ- ఆఫీస్‌ వ్యవస్థను అమలులోకి తెచ్చినట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు. దీని ద్వారా ప్రఽభుత్వ ప్రతిస్పందనల స్థిరత్వం మెరుగుపడుతుందన్నారు. పరిపాలనలో  నాణ్యత, వనరుల సమర్ధ నిర్వహణ, పారదర్శకతకు ఇది సరైన వేదిక అని తెలిపారు.  పౌరుల సమస్యలను తక్కువ సమయంలో పరిష్కరించడానికి  ఉపయోగపడుతుందని చెప్పారు. ఆగస్టును ఈ- ఆఫీస్‌ నెలగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

Read more