పింఛన్ కోసం నిలబడి.. వృద్ధురాలి మృతి
ABN , First Publish Date - 2020-09-16T09:52:00+05:30 IST
పింఛన్ కోసం లైన్‌లో నిలబడి ఓ వృద్ధురాలు మృతిచెందింది.

మొయినాబాద్ రూరల్, సెప్టెంబరు 15: పింఛన్ కోసం లైన్‌లో నిలబడి ఓ వృద్ధురాలు మృతిచెందింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామానికి చెందిన చెన్నకేశవ దేవమ్మ(80) ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్‌తో కాలం వెళ్లదీస్తోంది. ఈ మధ్య ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబసభ్యులు పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ఫించన్ తీసుకువస్తున్నారు. మంగళవారం దేవమ్మ పింఛన్ కోసం వెళ్లి పంచాయతీ కార్యాలయం ఎదుట వరుసలో నిలబడింది. ఈ క్రమంలో అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలింది.