స్టాండింగ్‌ కమిటీ నివేదికలో ప్రస్తావన లేని తెలంగాణ ఎయిర్‌పోర్టులు

ABN , First Publish Date - 2020-03-16T09:25:41+05:30 IST

టీజీ వెంకటేశ్‌ నేతృత్వంలోని కేంద్ర రవాణా, పర్యాటక, సాంస్కృతిక మంత్రి త్వ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ గత శుక్రవారం పౌర విమానయాన రంగంపై రాజ్యసభకు

స్టాండింగ్‌ కమిటీ నివేదికలో  ప్రస్తావన లేని తెలంగాణ ఎయిర్‌పోర్టులు

న్యూఢిల్లీ, మార్చి 15(ఆంధ్రజ్యోతి): టీజీ వెంకటేశ్‌ నేతృత్వంలోని కేంద్ర రవాణా, పర్యాటక, సాంస్కృతిక మంత్రి త్వ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ గత శుక్రవారం పౌర విమానయాన రంగంపై రాజ్యసభకు నివేదికను సమ ర్పించింది. దీనిలో తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిఽధిలోని మామునూర్‌, పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్‌, ఆదిలాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల అంశాన్ని ప్రస్తావించలేదు. డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌(2020-21)కి సంబంధించి సమర్పించిన నివేదికలో ఏపీకి సంబంధించి దుగదుర్తి, భోగాపురం, ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయా లను ప్రస్తావించడం గమనార్హం.

Updated Date - 2020-03-16T09:25:41+05:30 IST