నిలకడగా రజినీకాంత్‌ ఆరోగ్యం

ABN , First Publish Date - 2020-12-27T07:43:29+05:30 IST

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉన్నట్లు జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శనివారం ఆయనకు పలు వైద్య

నిలకడగా రజినీకాంత్‌ ఆరోగ్యం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉన్నట్లు జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శనివారం ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులకు అందిన ఆరోగ్య పరీక్షల నివేదిక ప్రకారం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారణ అయింది.

మరికొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. రాత్రిపూట రజినీకాంత్‌ రక్తపోటు స్థితిగతులను పరిశీలించి డిశ్చార్జి ఎప్పుడు చేయాలన్న విషయంపై ఆదివారం ఉదయం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాయి.


Updated Date - 2020-12-27T07:43:29+05:30 IST