22 నుంచి ఎస్‌ఎ‌స్‌సీ స్టెనోగ్రాఫర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-12-17T09:10:36+05:30 IST

గ్రేడ్‌-సి, గ్రేడ్‌-డి స్టెనోగ్రాఫర్‌ నియామక పరీక్షలను ఈనెల 22 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్టు స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌

22 నుంచి ఎస్‌ఎ‌స్‌సీ స్టెనోగ్రాఫర్‌ పరీక్షలు

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గ్రేడ్‌-సి, గ్రేడ్‌-డి స్టెనోగ్రాఫర్‌ నియామక పరీక్షలను ఈనెల 22 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్టు స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎ్‌ససీ) జాయింట్‌ సెక్రటరీ, హైదరాబాద్‌ ప్రాంతీయ సంచాలకుడు కె.నాగరాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు 4  రోజుల ముందు నుంచే కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. సందేహాలుంటే 044-28251139 లేదా 9445195946 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2020-12-17T09:10:36+05:30 IST