ఎస్సారెస్పీ పిల్ల కాల్వలకు గండ్లు

ABN , First Publish Date - 2020-07-22T09:27:57+05:30 IST

సూర్యాపేట జిల్లాలో చెరువులను నింపే ఎస్సారెస్పీ పిల్ల కాల్వలకు మంగళవారం రెండు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. జనగామ జిల్లా కొడకండ్ల సమీపంలోని

ఎస్సారెస్పీ పిల్ల కాల్వలకు గండ్లు

  • నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన నారుమళ్లు 

తిరుమలగిరి రూరల్‌/పెన్‌పహాడ్‌, జూలై 21: సూర్యాపేట జిల్లాలో చెరువులను నింపే ఎస్సారెస్పీ పిల్ల కాల్వలకు మంగళవారం రెండు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. జనగామ జిల్లా కొడకండ్ల సమీపంలోని బయ్యన్న వాగు నుంచి గోదావరి జలాలను ఎస్సారెస్సీ పిల్లకాల్వ ద్వారా సూర్యాపేటలోని చెరువులను నింపుతారు. ఈ కాల్వ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల వద్ద 69, 70, 71గా చీలుతుంది. తిరుమలగిరి మండలం మొండిచింత తండా మీదుగా బండరామారం చెరువులోకి వెళ్లే నీటి కాల్వకు మొండిచింత తండ వద్ద 69 డీబీఎంకు, పెన్‌పహాడ్‌ మండలం 71 డీబీఎం పరిధిలోని 57.3 కిలోమీటర్‌ వద్ద గండ్లు పడ్డాయి. దీంతో తాము సాగు చేసిన వరినాట్లు, నారుమళ్లు కొట్టుకుపోయాయని రైతులు వాపోయారు.

Updated Date - 2020-07-22T09:27:57+05:30 IST