శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం..నేడు ఘటనా స్థలానికి సీఐడీ చీఫ్‌

ABN , First Publish Date - 2020-08-22T13:07:06+05:30 IST

శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం..నేడు ఘటనా స్థలానికి సీఐడీ చీఫ్‌

శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం..నేడు ఘటనా స్థలానికి సీఐడీ చీఫ్‌

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ విచారణ ప్రారంభించింది. ప్రమాదం, 9 మంది మృతిపై స్థానిక ఈగలపెంట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు శుక్రవారం రాత్రి సీఐడీకి బదిలీ అయింది. సీఐడీ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ శనివారం ఘటనా స్థలానికి వెళ్తున్నారు. ఆయనతోపాటు ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దుర్ఘటనకు దారి తీసిన కారణాలను విశ్లేషించనున్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. 

Updated Date - 2020-08-22T13:07:06+05:30 IST