శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలోకి విచారణ కమిటీ

ABN , First Publish Date - 2020-08-22T18:45:05+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీఐబీ విచారణకు జల విద్యుత్ కేంద్రానికి అధికారులు చేరుకుంటున్నారు.

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలోకి విచారణ కమిటీ

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీఐడీ విచారణకు జల విద్యుత్ కేంద్రానికి అధికారులు చేరుకుంటున్నారు.  విచారణ కమిటీ జల విద్యుత్ కేంద్రంలోకి వెళ్లింది. ఎలక్ట్రిసిటీ, ఫోరెన్సిక్, సీఐడీ, లోకల్ పోలీస్ టీంలు పవర్ హోస్‌లోకి వెళ్లాయి. సి.ఐ.డి డిఎస్పీ, సిఐలు, ఎస్.ఐలు జల విద్యుత్ కేంద్రానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఐడీ  ఛీఫ్ గోవింద్ సింగ్  పవర్ హోస్‌కు చేరుకోనున్నారు.  జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించిన విషయాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. జల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లకు సంభందించిన డీఈలు, ఏఈలు కేంద్రం వద్దకు చేరుకున్నారు. చీఫ్ ఇంజనీర్, డైరెక్టర్లు జల విద్యుత్ కేంద్రానికి చేరుకున్నారు. 

Updated Date - 2020-08-22T18:45:05+05:30 IST