23న ఢిల్లీలో బీసీల జనగణన గర్జన: జాజుల
ABN , First Publish Date - 2020-03-13T09:19:15+05:30 IST
వచ్చే నెల 15 నుంచి చేపట్టనున్న జనగణనలో ప్రత్యేకంగా బీసీ కులాల గణనను చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ డిమాండ్ చేశారు.

బర్కత్‌పుర, మార్చి12 (ఆంధ్రజ్యోతి) : వచ్చే నెల 15 నుంచి చేపట్టనున్న జనగణనలో ప్రత్యేకంగా బీసీ కులాల గణనను చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీలో 23న బీసీల జనగణన గర్జన పేరుతో పార్లమెంట్‌ను ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీల జనగణన గర్జన వాల్‌పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఆరేళ్లైనా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించలేదని ధ్వజమెత్తారు. 23న చేపట్టనున్న జనగణన గర్జనకు 28 రాష్ట్రాల నుంచి బీసీలు తరలివస్తారని చెప్పారు.