కాంగ్రెస్ నేత శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-10-07T16:53:15+05:30 IST

కాంగ్రెస్ నేత శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ నేత శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: కాంగ్రెస్ నేత శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక నియోజకవర్గం ఐదేళ్లలో వెనకబడిపోయిందని విమర్శించారు. టీఆర్ఎస్‌లో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఆయన దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు.


ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో ఆనాడు తన తండ్రి ముత్యం రెడ్డితోపాటు టీఆర్ఎస్ పార్టీలో చేరామన్నారు. ఎన్నికల్లో తమను ఉపయోగించుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి శిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, కనీసం తమకు అదికూడా అడగలేదని, దీంతో ముత్యంరెడ్డి కుమిలిపోయి, నిజాయితీ చచ్చిపోయిందని, గుండెపగిలి చనిపోయారని అన్నారు. కనీసం ఏ మీటింగ్‌లకు కూడా తమను పార్టీ పిలవడంలేదని విమర్శించారు. టీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారో వారికే ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు.


Read more