కాంగ్రెస్‌లోకి శ్రీనివాస్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-10-07T07:43:29+05:30 IST
దుబ్బాక నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ నేత, దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివా్‌సరెడ్డి మంగళవారం కాంగ్రె్‌సలో చేరారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

గాంధీభవన్‌లో ముఖ్య నేతల సమక్షంలో చేరిక..
దుబ్బాక అభ్యర్థిని నేడు ప్రకటిస్తాం
టీఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పాలి: ఉత్తమ్..
ఇది తెలంగాణ ఆత్మగౌరవ ఎన్నిక: శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దుబ్బాక నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ నేత, దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివా్‌సరెడ్డి మంగళవారం కాంగ్రె్‌సలో చేరారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. శ్రీనివా్‌సరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో బంగారు భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా ఉత్తమ్ అన్నారు. అయితే దుబ్బాక ఉప ఎన్నికకు అభ్యర్థిని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదంతో బుధవారం ప్రకటిస్తామన్నారు.
దుబ్బాకలో తానే అభ్యర్థినంటూ మంత్రి హరీశ్‌రావు చెబుతున్నారని, అంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వ్యక్తిత్వం లేదా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపించి టీఆర్‌ఎ్‌సకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ ఉప ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవ ఎన్నిక అని చెరుకు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. 30 ఏళ్లపాటు ప్రజల కోసం బతికిన ముత్యంరెడ్డికి.. టీఆర్‌ఎస్ అవమానాన్ని రిటన్ గిఫ్టుగా ఇచ్చిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థేనన్నారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాతూ.. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం బాధాకరమని, అయితే నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేసిన చెరుకు ముత్యంరెడ్డి కూడా మరణించారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ తరఫున రామలింగారెడ్డి భార్య పోటీలో ఉంటే.. కాంగ్రెస్ తరఫున ముత్యంరెడ్డి కొడుకు పోటీలో ఉన్నారని ప్రకటించారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని బదిలీ చేయాలని, ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత కూడా వదలబోమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, పొన్నాల లక్ష్మయ్య, కుసుమ్‌కుమార్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.